సిపిఎం మోటార్ సైకిల్ యాత్ర కు కొమ్మాది కూడలిలో స్వాగతం పలికిన మధురవాడ జోన్ సిపిఎం నాయకులు.
కొమ్మాది: వి న్యూస్ : సెప్టెంబర్ 20:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర లో ఆరు జిల్లాలు లో సిపిఎం నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కు కొమ్మాది కూడలి, త్రీశక్తి దేవాలయం వద్ద సిపిఎం మధురవాడ జోన్ కమిటీ స్వాగతం పలికింది. ఈ యాత్ర కు నాయకత్వం వహిస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాథం స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జే అయోధ్యరామ్ మాట్లాదుతు విశాఖ ఉక్కు పరిశ్రమ ఎవరి దయాదాక్షిన్యాలు తో నిర్మాణం జరగలేదని తెలియజేశారు.ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించుకున్న విజయానికి చిహ్నం అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తమ భూముల్ని 22 వేల ఎకరాలు ఇచ్చి ప్లాంట్ నిర్మాణానికి తోడ్పడ్డారని, ఆ రకంగా త్యాగం చేశారని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అప్పటి అసెంబ్లీలో 52 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామాలు చేసి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పోరాడారని తెలియజేశారు. ఐదువేల కోట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం డపదపాలుగా పెట్టుబడి పెడితే, స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి అనేక రూపాల్లో 54 వేల కోట్లు రూపాయలు చెల్లించిందని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కరోనా విలయతాండవం చేస్తూ, ఆక్సిజన్ అందుకా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో, ఉచితంగా ఆక్సిజన్ అనేక రాష్ట్రాలకు సరఫరా చేసిందని తెలియజేశారు. మన ఉత్తరాంధ్రకు మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ను కేంద్రంలో పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కారు చౌకగా కార్మికుల శ్రమను దోచే దోపిడీదారులకు అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరిగే ప్రతి పోరాటంలో ప్రజలందరూ పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని కోరారు. ఈ యాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ కే ఎస్ వి కుమార్, బి జగన్, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి సిపిఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో మధురవాడ జోన్ కార్యదర్శి డి అప్పలరాజు, నాయకులు పి రాజ్ కుమార్, బి భారతి, డి కొండమ్మ, కే సుజాత, జి చిన్నారావు టీ రమేష్, కే రాము, మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు అనంతరం యాత్ర తగరపుల్స్ వైపు వెళ్ళింది.