టిడిపి అథినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నేడు జరుగుతున్న "రాష్ట్ర బంద్"కు సిపిఐ సంపూర్ణ మద్దతు

టిడిపి అథినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నేడు జరుగుతున్న "రాష్ట్ర బంద్"కు సిపిఐ సంపూర్ణ మద్దతు

విశాఖ జిల్లా: వి న్యూస్ : సెప్టెంబర్ 11:

టిడిపి అథినేత, మాజీ ముఖ్య మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై అథికార వైసీపీ రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలలో భాగంగా హింసకు పాల్పడుతూ రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసి అక్రమ పద్ధతులలో అరెస్టు చేయడానికి నిరసనగా టిడిపి తలపెట్టిన *రాష్ట్ర బంద్* కు సిపిఐ విశాఖ జిల్లా సమితి సంపూర్ణ మద్దతును సాంఘిబావాన్ని తెలుపుతున్నదని పార్టీ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతృత్వ విథానాలతో అరాచక పాలన కోనసాగిస్తున్నదని 

ఎపిలో రూల్ ఆఫ్ లా పాటించడంలేదని 

ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసు వ్యవస్థ అథికారపార్టీ చెప్పుచేతల్లో పనిచేస్తూ ప్రతిపక్షాలను వేథించడమే థ్వేయంగా పనిచేస్తుందదని విమర్శించారు.

ప్రభుత్వ అణిచివేత అథికమైతే తిరుగుబాటు మొదలౌతుందని చరిత్ర సత్యంమని తెలిపారు.

వేథిపులు, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులు, నిర్భంథాలు, జైళ్ళు థ్వారా ప్రజా ఉథ్యమాలను, ప్రజాస్వామిక హక్కులను హరించాలని ఎపి ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం ఈ అరాచక, అభివృద్ధి నిరోథక వైసీపి ప్రభుత్వాన్ని గద్దెదింపాలని,

టిడిపి తలపెట్టిన నేటి రాష్ట్ర బంద్ కు సిపిఐ పార్టీ, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని తెలుపుతున్నాదని తెలిపారు.