_ఆత్మహత్యలను తరుముదాం

 *_ఆత్మహత్యలను తరుముదాం._*  

 మానసిక వైద్య నిపుణరాలు డాక్టర్ ఎన్ తేజస్విని 

ఆనందపురం వి న్యూస్ 12

విశాఖపట్నం జిల్లా ఆసుపత్రులు కన్వీనర్ డాక్టర్ రమేష్ కిషోర్  ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆత్మహత్య నిరోధక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆనందపురం గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆ సమయంలో తల్లిదండ్రుల దగ్గనుండి గాని ఉపాధ్యాయులు గాని స్నేహితులను మంచి సలహాతో ముందుకు కొనసాగాలని ఆత్మస్థైర్యంతో నడుచుకోవాలని తెలియజేశారు.  

నేటి యువత చెడువేసినలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఎందుకంటే  చెడువ్యస సనాలకు బానిసవడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలు జరుగుతున్నాయని దయచేసి గమనించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాజానికి మంచి పేరు తీసుకు వచ్చేవారుగా మీరు ఉండాలని మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలని డాక్టర్ ఎన్ తేజస్విని సూచించారు.   

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ రావు .  ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ మం.గంగు నాయుడు, సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి   ఉపాధ్యాయులు హాస్పిటల్ సిబ్బంది సోషల్ వర్కర్ జి సత్తిబాబు పాల్గొన్నారు.