చంద్రబాబు నాయుడు అరెస్టులో ప్రభుత్వ కుట్ర లేదు*విశాఖ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు కోలా.గురువులు
ఎండాడ వి న్యూస్ సెప్టెంబర్ 12
చంద్రబాబు నాయుడు అరెస్టులో ప్రభుత్వ కుట్ర ఉందని అనడంలో అర్థం లేదని, 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణల రుజువయ్యాయి కాబట్టే జైలు పాలు అయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ కోల గురువులు అన్నారు. మంగళవారం ఎండాడ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికి అతీతం కాదని చంద్రబాబు విషయంలో తేటతెల్లమైందన్నారు.
బాబు చేసిన నేరాలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, విమర్శించడం సరైనది కాదన్నారు. ఆర్థిక నేరాలకు, కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం అన్యాయం అంటూ బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు ఆందోళనకు దిగడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాయుడు పై కక్ష సాధించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసిపి ప్రభుత్వానికి లేదని, ఆయన తప్పు చేశారు కాబట్టే అరెస్టు చేయాల్సి వచ్చిందని, నిజా నిజాలు ప్రజలు గమనించాలని కోరారు.

