కొమ్మాదిలో టీడీపీ,జనసేన నిర్వహిస్తున్న బంద్ లో టీడీపీ, జనసేన నాయకులు అరెస్ట్
కొమ్మాది: వి న్యూస్ : సెప్టెంబర్ 11:
జీవీఎంసీ 5 వ వార్డ్ పరిధిలోగల కొమ్మాది జంక్షన్లో టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు ను ఖండిస్తూ టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి *మొల్లి లక్ష్మణరావు* ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ 5,6,7,8 వార్డుల టిడిపి నాయకులు మరియు జనసేన నేతలతో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ *పంచకర్ల సందీప్* పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. టీడీపీ, జనసేన సంయుక్తంగా శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్ ని అడ్డుకుని టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ జీపులో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పోలీసులు.
