మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

 మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం..!

శ్రీ పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్


విన్యూస్ ప్రతినిధి మధురవాడ:  

జీవీఎంసీ 5,7, వార్డుల పరిధి నగరంపాలెంలో శ్రీ పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,టిడిపి వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ(జపాన్), రూపాదేవి ఆధ్వర్యంలో... వాతావరణ,భూ కాలుష్య పరిరక్షణ ధ్యేయంగా సుమారు 500 మట్టి గణపతి విగ్రహాలను నియోజకవర్గం  సమన్వయకర్త కోరాడ రాజబాబు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు, రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి. కార్యదర్శి నాగోతి శివాజీ,నమ్మి శ్రీను, కానూరి అచ్యుత్ రావు, వారి చేతుల మీదుగా...  మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ(జపాన్),  వార్డ్ ప్రజలందరికీ మహాగణపతి,ప్రథమ పూజితుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొంది, సుఖశాంతులు,అష్టైశ్వర్యాలు పొందుతారని కోరుకుంటున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గరే గుర్నాథ్,పొట్టి ప్రసాద్,నాగోతి అప్పలరాజు,ఇల్లిపిల్లి పద్మ, గ్రామ పెద్దలు సత్యంబాబు, వాండ్రాశి బాబులు,ఇల్లిపిల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.