భూములు కోల్పోయిన రైతులకు ఇస్తామన్నా ఇల్లు ఇవ్వండి. కెవిపిఎస్..

 భూములు కోల్పోయిన రైతులకు ఇస్తామన్నా ఇల్లు ఇవ్వండి. కెవిపిఎస్..

పియం పాలెం విన్యూస్ సెప్టెంబర్ 22

కొమ్మాది, బక్కన్న పాలెం, రేవాళ్ళు పాలెం, గ్రామాల రైతుల నుండి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వకపోగా, కనీసం ప్రభుత్వం, అధికారులు ఇస్తామన్నా ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం అన్యాయమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షులు సియాద్రి పైడితల్లి అన్నారు. జివిఎంసి 6వ వార్దు అవంతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జగనన్నకు చెపుదాం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ కి బాధితులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ కి వివరిస్తూ కలెక్టర్ కార్యాలయానికి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయానికి, విశాఖ రూరల్ తాసిల్దార్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు వెళుతూ అధికారులు కలుస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ హౌసింగ్ పీడీ  తాహశీల్దారు అందరూ ఇల్లు ఇస్తామని చెప్పడం తప్ప ఇంత వరకు ఇల్లు అప్పగించడం  లేదని అన్నారు.

సంవత్సరం క్రితం రూరల్ మండల కార్యాలయం నుండి వచ్చి మూడు గ్రామాలలో ఎంక్వయిరీ చేశారని,కావలసిన పత్రాలు,చనిపోయిన వారి వారసులు,బ్రతికి వుండి వారసులకు ఇవ్వాలని కోరిన వారి నుండి ఎన్ ఓ సి,నొట్రి చేయించి తీసుకు వెళ్లారని తెలియ జేశారు.అనేక సంవత్సరాలనుండి తిరుగు తున్నామని తెలియ జేశారు.

అభి వృద్ధి పేరు తో పేదలు,దళితులు అయిన రైతులకు ఇచ్చిన భూములు ఏటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా,బలవంతంగా తీసుకున్న ప్రభుత్వం కనీసం ఇస్తామన్న ఇళ్ళు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.కలెక్టరు స్పందించి,రైతులకు ఇస్తామన్న ఇల్లు కోసం వంద ఇల్లు కేటాయించడం జరిగిందని,

ఎం ఎల్ ఏ  కి కోటా కింద కేటాయించామని మీకు ఇస్తారని హామీ ఇచ్చారు.ఆందోళన చెందనవసరం లేదని అన్నారు.రూరల్ తహశీల్దారు కు చేయావల్సిన ప్రక్రియ, పూర్తి చేయాలని ఆదేశించారు.స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ నాయకులు డి అప్పలరాజు,సి ఐ టీ యు నాయకులు పి రాజు కుమార్, మధురవాడ దళిత సంఘాల నాయకులు సింహాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.