మధురవాడ పి ఎ సి ఎస్ కాంప్లెక్స్ కూల్చి పెట్రోల్ బంక్ నిర్మించాలను కోవడం దుర్మార్గం

 మధురవాడ పి ఎ సి ఎస్ కాంప్లెక్స్ కూల్చి పెట్రోల్ బంక్ నిర్మించాలను కోవడం దుర్మార్గం  - మాజీ ఉపాధ్యక్షుడు మరుపిళ్ల  పైడిరాజు*

మధురవాడ విన్యూస్ సెప్టెంబర్ 22

పూర్వికులు స్థాపించిన మధురవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన  సముదాయం 2007 లో నూతనంగా నిర్మించామని ఇప్పుడు ఆ భవనం కూల్చి ఆ స్థానంలో నూతనంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తామని గురువారం సహకార అధికారులు వచ్చి కొలతలు తీసుకొని వెళ్ళారని ఇది పూర్తిగా సహకార స్పూర్తికి విరుద్దమని సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తెలిపారు.శుక్రవారం మధురవాడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పైడిరాజు మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ఈ వాణిజ్య సముదాయం నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కృషి హయాంలో మంచి కృషి చేసారని తెలిపారు.


కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం అమలు తిరస్కరించాలని అభివృద్ధి లో ఉన్న పి ఎ సి ఎస్ ని క్రెడిట్ సొసైటీ గా మార్చి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ అంశం స్థానిక శాసనసభ్యులు ఎం శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తామని సమస్య పరిస్కారం కోసం సంఘం సభ్యులు, అభివృద్ధికి సహకారానికి కృషి చేసేవారందరితో చర్చించి ఈ సొసైటీని కాపాడుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో సంఘం సభ్యులు సిపిఐ నాయకులు కొల్లి మేఘారావు, పెంటపల్లి కాంతమ్మ, వి సత్యనారాయణ, ఎం డి బేగం జి వేళంగినిరావు, ఎం ఎస్ పాత్రుడు, కె కుమార్ తదితరులు పాల్గొన్నారు.