జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న విమర్శలను ఖండించిన అభిమానులు

 *జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న విమర్శలను ఖండించిన అభిమానులు* : 

 *ఆనందపురం* : విన్యూస్ సెప్టెంబర్ 22


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పై వస్తున్న విమర్శలను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందపురం మండలం నీళ్లకుండీలు జంక్షన్ వద్ద శుక్రవారం టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు లెంక సురేష్ మాట్లాడుతూ



 స్పందించడం, స్పందించకపోవడం అనేది ఆయన వ్యక్తిగతం అని, యాక్టర్ గా మంచి పేరు సంపాదిస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న  వ్యక్తి పై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తాత  పెట్టిన పార్టీలోనే తాను ఉంటాను అని, ఇదే విషయాన్ని పదేపది సార్లు చెప్పనవసరం లేదని అన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పృథ్వీరాజ్, పక్కుర్తి అప్పలనాయుడు, బొడ్డు కుమార్, నాగిశెట్టి ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.