తగరపువలస, ఆదర్శనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి
తగరపువలస: వి న్యూస్ : సెప్టెంబర్ 20:
జి.వి.యం.సి. రెండవ వార్డు తగరపువలస, ఆదర్శనగర్ కాలనీలో వర్షాల కారణంగా కాలువలు అన్నీ పాడైపోయి మురికి నీరు అంతా రోడ్లపైకి వచ్చినందున ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నారు.(బుధవారం) జి.వి.యం.సి. రెండవ వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి వార్డు పర్యటన చేసి అక్కడి పరిస్థితులు చూసి గత రెండు సంవత్సరాలు క్రితమే ఈ విషయమై జి.వి.యం.సి. అధికారులుకి వినతి పత్రం సమర్పించడం జరిగింది, కానీ ఇప్పటికి అధికారులు నుండి ఎటువంటి స్పందన లేక ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలనీ డ్రైనేజ్ వాటర్ అంతా ప్రైవేట్ లేఔట్లోకి వెళ్లవలిసి ఉన్నది. కావున అధికారులు అక్కడ సర్వే చేసి ఆ లే ఔట్ యజమానులుతో సంప్రదించి బాధితులకు (TDR) నస్టపరిహారం చెల్లించి డ్రైనేజ్ ఔట్లెట్లు ఏర్పాటు చేయవలిసిందిగా కోరుచున్నామని చెప్పారు. మరియు ఈ మురికికాలువలు ఎక్కడికక్కడ స్తంబించిపోవడం వలన అక్కడ ప్రజలు డెంగ్యూ వంటి అనారోగ్యాలకు గురుకావాల్సి వస్తుంది అని అన్నారు. అంతే కాకుండా అక్కడ ప్రజల మద్య తగాదాలు కూడా ఏర్పడుచున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు , పిట్టా వెంకటరావు (మాజీ కౌన్సిలర్), చేట్ల రమణ (మాజీ కౌన్సిలర్), జీరు సత్యం, చిల్ల అప్పలరెడ్డి (మాస్టర్), చిల్ల ఎర్రయ్య రెడ్డి, జీరు ఈశ్వరరావు, సరగడ గోపి రెడ్డి, చేట్ల గురుమూర్తి రెడ్డి, ఊల్ల దుర్గారావు, పూతి రవికుమార్, రిక్క సత్యవతి, బోయి ఆశారెడ్డి, బెల్లాన నూకరాజు, గండిబోయిన రాజు మరియు అక్కడ ప్రాంత వాసులు పాల్గొన్నారు.