బ్రిటిష్ లాంటి బెయిల్ ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్ర భవితవ్యం. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం: వి న్యూస్ : సెప్టెంబర్ 20:
రాష్ట్రంలో పాలన 'పిచ్చోడి చేతిలో రాయి'2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు అరెస్ట్
రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేన - టిడిపి పొత్తు
175 కి 175 స్థానాలు విజయం సాధించడం ఖాయం
ఇష్టం లేకపోయినా పోలీసులు ఒత్తిడితో పని చేస్తున్నారు.
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం : రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఎద్దేవా చేశారు. డాబా గార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ లాంటి బెయిల్ ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్ర భవితవ్యం, బ్రిటిష్ ఫాలనలో కూడా ఇంతటి అరాచకం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. వారికి ఇష్టం లేకపోయినా ఒత్తిడితో పనిచేస్తున్నారన్నారు. అనేక కేసులలో ఉపయోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పై వచ్చి పరిపాలన సాగిస్తే పరిపాలన ఇలాగే ఉంటుందన్నారు. మరోవైపు మంత్రులు తమ బాధ్యతలను మరిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికలలో ఓటమి తప్పదనే విషయం స్పష్టంగా తెలియడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా చంద్రబాబు నాయుడు పై కేసులు పెట్టి అరెస్టు చేయించారన్నారు. అరెస్టు చేసి జైలులో పెట్టిన తర్వాత సాక్షాలు సేకరిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఏపీ ఫైబర్, రింగ్ రోడ్డు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ.. మరికొన్ని కేసులను తవ్వే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం - జనసేన కూటమి175 కి 175 నియోజకవర్గాలలో క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు.
విలేఖ సమావేశంలో పి. వసంతరావు, బోడేపూడి దొరబాబు, దువ్వి పరమేశ్వరరావు, కె.ఎన్.ప్రసాద్, అనసూరి మధుసూదన రావు, గండి మోహన్, పి.గురునాథ్ రావు, కోరాడ శ్రీనివాసరావు, సిహెచ్.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.