జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటిన యూత్ టైక్వాండో క్రీడాకారులు.

జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటిన యూత్ టైక్వాండో క్రీడాకారులు

మధురవాడ : వి న్యూస్ :సెప్టెంబర్ 14

సెప్టెంబర్ 2 నుంచి 4వ తేధి వరకు జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన 14 వ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటిల్లో మన రాష్ట్ర తరుపున పాల్గొన్న యూత్ టైక్వాండో క్రీడాకారులు 2 పతకాలు సాధించారు.క్యాడెట్ 53 kg విభాగములో మణికంఠ హిమాన్ష్ ద్వితీయ స్థానం, పూమ్సే క్యాడెట్ విభాగంలో సాయి ప్రతాప్ తృతీయ స్థానం సాధించారని విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అచ్చిం నాయుడు తెలియపరిచారు. విజయం సాధించిన క్రీడకారులకు శ్రీ కనక దుర్గా సప్లయర్స్ అండ్ క్యాటరింగ్ అధినేత కొర్రాయి సురేష్, యూత్ టైక్వాండో కార్యదర్శి ఎం సురేష్ మరియు కోచ్ సుకుమార్ సంపత్, ఈ కార్యక్రమంకి క్రీడాకారులు తల్లిదండ్రులు పిల్ల సురేష్, పోతిన శివ మరియు అనిల్ పతకాలు అందజేసి బహుమతులతో ప్రోత్సహించారు.