రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని ఆదుకున్న జనసేన పార్టీ..
భీమిలి వి న్యూస్ ప్రతినిధి 05
జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వం ద్వారా భీమిలి నియోజకవర్గ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు అప్పలకృష్ణా రెడ్డి కి హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం Rs. 50,000/- చెక్కు్ద్వా రా స్వయంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంతకం చేసి పంపడం జరిగింది.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు, బొడ్డపాలెం గ్రామం వద్ద భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల చేతుల మీదుగా గాయపడిన వారికి ఈ చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో భీమిలి నాయకులు శాఖరి శ్రీనుబాబు, అనిల్, సాగర్, మూర్తి, సుబ్బు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

.jpeg)
