సంకల్ప సత్యగ్రహ దీక్ష -కాంగ్రెస్ పార్టీ

సంకల్ప సత్యగ్రహ దీక్ష -కాంగ్రెస్ పార్టీ

మచిలీపట్నం:

మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకల్ప సత్యగ్రహ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మచిలీపట్నంలో జడ్పీ సెంటర్ నుంచి పెడన వెళ్ళే రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క సత్యాగ్రహ నిరసన దీక్ష ఉదయం 10 గంటల నుండి నిరసన దీక్ష ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క దీక్ష కొనసాగుతుందని మచిలీపట్నం జిల్లా అధ్యక్షక్షులు లామ్ తాంతి కుమారి మీడియాకు తెలియజేశారు.
ఈ యొక్క నిరసన దీక్షలో మోడీ నిరంకుశ వైఖరి పరిపాలన నశించాలి, రాహుల్ గాంధీ పై పెట్టిన లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని కేసుని విరమించుకోవాలని ఈ యొక్క దీక్షలో ముఖ్య నినాదాలుగా చేయటం జరిగింది ఈ యొక్క దీక్షలో జిల్లా అధ్యక్షులు శ్రీమతి లాం తాంతియా కుమారి తో పాటు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు పిసిసి సెక్రెటరీ మొహమ్మద్ దాదాసాహెబ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఫిరోజ్ బేగ్, DCC మీడియా చైర్మన్ ఊటుకూరి శాంతిరాజు, పెడన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి లింగాల సుధాకర్ రావు, పామర్రు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి పెదపూడి దిలీప్, డిసిసి ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ చాన్ బాషా, పట్టణ మచిలీపట్నం అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖ ,ర్రౌతు రాంబాబు ,అవినిగడ్డ మండల అధ్యక్షుడు దిడ్ల వీర రాఘవులు విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ యు జోసెఫ్, పీసీసీ డెలిగేట్ నల్లబోలు కుమారి మరియు కార్యకర్తలు అభిమానులు ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.