రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రసార కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు

 రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు  జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు...

రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం    రాష్ట్ర  వాణిజ్య విభాగం   ప్రసార కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు    

శ్రీహరిపురం : వి న్యూస్ 

విశాఖ జిల్లా శ్రీహరిపురం విశాఖ జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ   రాష్ట్ర  వాణిజ్య విభాగం   ప్రసార కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు    నివాసం  దగ్గర  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు  53వ జన్మదినం సందర్భంగా జన్మదిన సందర్భంగా కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమక్షంలో  కేక్ కట్ చేసిన కోరాడ  శ్రీనివాసరావు.  

మీడియాతో మాట్లాడుతూ కింజరాపు అచ్చెన్నాయుడు   కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ  మొన్న  జరిగిన  పట్టభద్రుల ఎన్నికల్లో విజయడంఖా మోగించగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించే తీరు చూస్తుంటే రానున్న ఎన్నికలలో టీడీపీ జెండా విజయ ఢంకా మోగడం ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తన పూర్వవైభవం వైపు దూసుకెళు తోందన్నారు. ప్రజల్లో చంద్రబాబుతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతోందనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు