మీలో ప్రతిభను "వేదిక" ద్వారా కనబరుచుకోండి "వేదిక" కార్యక్రమానికి అపురూప స్పందన

 

  • మీలో ప్రతిభను "వేదిక" ద్వారా కనబరుచుకోండి 


  •  "వేదిక" కార్యక్రమానికి అపురూప స్పందన


జివిఎంసి  కమిషనర్ పి రాజబాబు



విశాఖపట్నం, మార్చి-5:- ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని దానిని నిరూపించుకునేందుకు "వేదిక" అవసరమని జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్కే బీచ్ కాళీమాత గుడి వద్ద ఏర్పాటుచేసిన "వైజాగ్ గాట్ టాలెంట్" కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథ తో కలిసి ప్రారంభించారు .


 ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేదిక ముఖ్య ఉద్దేశం విశాఖ ప్రజలు ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని దానిని నిరూపించుకునేందుకు వేదిక అనేది అవసరమని భావించి పోలీస్ కమిషనర్ ఆలోచన మేరకు జివిఎంసి ఆధ్వర్యంలో “వైజాగ్ గాట్ టాలెంట్” అనే కార్యక్రమాన్ని  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి  ఏదో ఒక రంగంలో ప్రతిభ ఉంటుందని ముఖ్యంగా పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుందని ఈ ప్రతిభను నిరూపించుకోవడానికి వేదిక అవసరమని భావించి వారి కొరకు వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది పూర్తిగా ఉచితమని ప్రతి రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతిరోజు మీ టాలెంటును నిరూపించుకోవచ్చని దీని కొరకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయా తేదీలు వారీగా ఇక్కడ మీ ప్రతిభని ప్రదర్శించవచ్చు అన్నారు. ప్రస్తుతం 386 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 13 గ్రూపులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని కమిషనర్ తెలిపారు


 అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మంచి ఆలోచనతో “వేదిక” ఏర్పాటు చేసినందుకు జివిఎంసి కమిషనర్ ని అభినందిస్తూ ఆర్కే బీచ్ కి ఎంతోమంది సందర్శకులు వస్తారని, ఇటువంటి వేదిక” ద్వారా వారికి ఆహ్లాదం కల్పించడంతోపాటు  నగర ప్రజల్లోని ప్రతిభను కనబరచుకోవచ్చని, టాలెంట్ ఉన్నప్పటికీ వేదిక లేనందున వారిలోని ప్రతిభ నిరుపయోగం అవుతుందని, వేదికకు ఎంతో ఖర్చవుతుందని ఇది భరించడం అందరికీ సాధ్యం కాదని, జివిఎంసి కమిషనర్ ఇక్కడ నగర ప్రజలకు ఉచితంగా వారి ప్రతిభను కనబరుచుకొనుటకు వైజాగ్ ఘాట్ టాలెంట్ అనే వేదికను ఏర్పాటు చేశారన్నారు.  అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను వారిలో ఉన్న ప్రతిభను ఈ వేదిక ద్వారా నిరూపించుకోవచ్చు అన్నారు.


 ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, జోనల్  కమిషనర్ విజయలక్ష్మి, జివిఎంసి ఎస్టేట్ ఆఫీసర్ ఆనంద్, ఏఎంఓహెచ్లు డాక్టర్  కిషోర్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు