వృద్ధురాలి ఆచూకీ తెలిసినప్పటికీ హృదయాన్ని కదిలించే ఎన్నో కథనాలు..

వృద్ధురాలి ఆచూకీ తెలిసినప్పటికీ హృదయాన్ని కదిలించే ఎన్నో కథనాలు..

తల్లి మనస్సు ఎంత గొప్పదో..

తల్లి తన కడుపులో బిడ్డను  నవమాసాలు మోసి బిడ్డ ఒక స్థాయికి వచ్చేంతవరకు పెంచి,పోషించి వారి ఎదుగుదలను చూస్తూ సంతోషపడి ఏనాడు పిల్లలు నాకు భారం అనే ఆలోచన లేకుండా తల్లి జీవిస్తుంది. ఇంక వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంక గ్రామంలో గుర్తుతెలియని ఒక వృద్ధురాలు తిరుగుతున్నట్లు శుక్రవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు వారి సహకారంతో వృద్ధురాలి ఆచూకీ తెలియపరచగలరు అనే కథనాలతో సోషల్ మీడియాలో నేడు ప్రచురించగా తక్షణమే ఎంతో మంది మహానుభావులు స్పందించి ఆ వృద్ధురాలైన తల్లిని ఎస్ఐ ఎస్.శివ ప్రసాద్,బడుగువాణిలంక మహిళా పోలీస్ కృష్ణవేణి సహకారంతో తన స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన వారి కుమారులకు అప్పగించడం జరిగింది. అయితే ఆ తల్లిని స్థానికులు, కుమారుడు కలిసి ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చేవాని ప్రశ్నించగా  మనసును కదిలించే ఎన్నో సమాధానాలు ఆ తల్లి హృదయంలో ఉన్నాయి. తల్లి మాట్లాడుతూ మా ఇంటి దగ్గర ఎవరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండరని,అందరూ బాగానే చూసుకుంటారు గాని నా కుమారులకు నేను భారం అవ్వకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఇలా బయటికి రావడం జరిగిందని,ఇప్పటికీ మించింది ఏమీ లేదు గాని వృద్ధల ఆశ్రమంలో నన్ను చేర్పించండి అని ఆ తల్లి ప్రాధేయపడి.కుమారుడు ఆమెను ఒప్పించి గృహానికి తీసుకెళ్లడం జరిగింది.ఇందుకు సహకరించిన స్థానిక ఎస్ఐ ఎస్.శివ ప్రసాద్ ను, బడుగు అని లంక మహిళా పోలీస్ కృష్ణవేణిని స్థానికులు అభినందించారు.