పీలేరు నియోజకవర్గంలో మహిళ దినోత్సవం రోజు మాట్లాడిన విషయాన్ని మార్ఫింగ్ చేశారు
వంగలపూడి అనిత కామెంట్స్:
పీలేరు నియోజకవర్గంలో మహిళ దినోత్సవం రోజు నేను మాట్లాడిన విషయాన్ని మార్ఫింగ్ చేశారు..
వాళ్ళు నా ఆడియో మార్ఫిగ్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు...
దాన్ని ఆధారంగా చేసుకుని అచ్చం నాయుడు ద్వారా లెటర్ కూడా పంపించినట్లు ఫేక్ లెటర్ ను కూడా నాకు పంపించారు
ఇదే కాకుండా నేను ఎడ్చినట్టు కూడా ఒక ఫోటోను రెలేజ్ చేశారు
రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు
సాక్షి చానెల్ లో కూడా ఎడిట్ చేసి టెలికాస్ట్ చేశారు
ఇదే విషయమై పాయకరావుపేట లో కేసు నమోదు చేశామని వెళ్తే అక్కడ ఎస్ఐ కోర్టులో తేల్చుకోండి అని చెప్పారు.
పోలీస్ రిపోర్ట్ కూడా తీసుకోకపోవటం దుర్మార్గం
దళిత మహిళా పై చేసిన ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు
సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇవి మాకు సంబంధం లేదు అని అంటున్నారు
ఏపీలో పోలీస్ శాఖ నిర్వీర్యం అయిపోయింది
దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్ పెట్టీ ఎవర్ని మోసం చేస్తున్నారు
సీఎం జగన్ బయటకు వస్తే పరదాలు కట్టడానికేన వీళ్ళు పోలీసులు అయింది
మా నియోజిక వర్గంలో ఈ ప్రభుత్వం పై వీడియోస్ క్రింద పెట్టిన కామెంట్స్ కు యువకుడిని తీసుకుని వెళ్లి ఒకరోజు మొత్తం స్టేషన్ లో కూర్చోబెట్టారు.
భార్గవ్ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయమని చెప్పాను
కనీసం కేసు కూడా నమోదు చేయటానికి ఎందుకు భయపడుతున్నారు
దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తాను

