అవంతికి భారీ షాక్...
భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీకి మరియు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి కోలుకోలేని దెబ్బ. అవంతి శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు గతంలో ప్రజారాజ్యం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసిన దగ్గర నుండి అవంతికి కుడి భుజంగా వ్యవహరిస్తూ రాజకీయంగా అన్ని తానై చూసుకున్నా ఈడూముడి నాగసూర్య చంద్రరావు నేడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచే వరకు అహర్నిశలు కృషి చేస్తాను అని చంద్రరావు పవన్ కళ్యాణ్ కి మాట ఇచ్చారు.
అలానే విశాఖపట్నం VMRDA చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల సొంత బావ కుమారుడు శ్రీ అక్కరమాని దివాకర్ , మధురవాడ నుండి ప్రముఖ బిల్డర్ నక్క శ్రీధర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అయ్యారు.
చంద్రరావు తో పాటు ఇంత మంది ఒకేసారి జాయిన్ అవ్వడం అవ్వడం భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడం, వైసిపి కి ఒక పెద్ద దెబ్బగా అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులను శ్రీ శాఖరి శ్రీనివాస్ బీవీ కృష్ణయ్య ఓమ్మి దేవీ యాదవ్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

