ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు

 ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు..

భీమిలి వి న్యూస్

ఆనందపురం మండలం బోయ పాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వృక్ష ఫౌండేషన్ సభ్యులు పిల్లి సాయి రెడ్డి ఆధ్వర్యంలో కెరియర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ యువతను చదువుపై దృష్టి పెట్టి, రాబోయే పరీక్షలలో  మంచి ఫలితాలను సాధించాలనే ఆకాంక్షించారు. 

విద్యార్థిని విద్యార్థులకు  ఉమెన్ సేఫ్టీ,కమ్యూనికేషన్ స్కిల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తూ,  విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పిల్లి సాయి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్ర ప్రగడ వెంకటేశ్వరరావు గారు, స్కూల్ కమిటీ చైర్మన్ జామి రాణి సభ్యులు పాల్గొన్నారు.