పంచమర్తి అనురాధకు అభినందనలు తెలిపిన వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా:వి న్యూస్ ప్రతినిధి :23.03.2023
175 స్థానాల్లో గెలుపుకు కాదు ఓటమికి సిద్ధంగా ఉండండి: వెనిగండ్ల రాము
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన పంచమర్తి అనురాధకు వెనిగండ్ల రాము అభినందనలు తెలిపారు..వెనిగండ్ల రాము కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ నాయకులు సంబరాలను నిర్వహించారు.
పంచమర్తి అనురాధ గెలుపు తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది.ప్రజల్లోనే కాదు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం పై వ్యతిరేకత చూపిస్తున్నారు. వైకాపా పార్టీ భూస్థాపితం అవ్వటానికి పునాది పడింది అని వెనిగండ్ల రాము అన్నారు.175 స్థానాల్లో గెలుపుకు కాదు ఓటమికి సిద్ధంగా ఉండండి అని వెనిగండ్ల రాము సవాల్ విసిరారు.


