సీసీఎల్ రూపంలో నయా జోష్

సీసీఎల్ రూపంలో నయా జోష్

మధురవాడ వి న్యూస్ 

పిఎం పాలెం క్రికెట్ స్టేడియం లో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ రాణించకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందేలోగా, క్రికెట్ ప్రేమికులకు సీసీఎల్ రూపంలో నయా జోష్ ను నింపనుంది. సుదీర్ఘ విరామం తర్వాత విశాఖలో జరుగుతున్న తారల క్రికెట్ కు అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తుంది. ముందుగా ముంబై హీరోస్ బోజ్ పూరి దబాంగ్స్ తలపడనుండగా, రెండో మ్యాచ్ కన్నడ బుల్డోజర్ తో తెలుగు వారియర్స్ తలపడనున్నారు. 

వీరిలో గెలిచినవారు శనివారం ఫైనల్లో ఆడనున్నారు. సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ హీరోలు తమ ప్రాక్టీస్ తో ఆకర్షించారు. గ్రౌండ్ లో నాలుగు చలనచిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ సినీ ప్రముఖుల మధ్య అద్భుతమైన టాలెంట్ ను ప్రదర్శించనున్నారు. సీసీఎల్ ను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.