సృజన పాఠశాల చిన్నారుల టాలెంట్ షో

సృజన పాఠశాల చిన్నారుల టాలెంట్ షో

పిఎం పాలెం:


చిన్న వయస్సు నుంచే పిల్లల్లోని సృజనాత్మక ను వెలికి తియ్యాలని సృజన పాఠశాల డైరెక్టర్ మొహమ్మద్ షరీఫ్ అన్నారు. మహా విశాఖ 6 వ పరిధి పిఎం పాలెం చివరి బస్ స్టాప్ వద్ద గల సృజన పాఠశాలలో శనివారం  చిన్నారి విద్యార్థులతో టాలెంట్ షో ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ఇలాంటి టాలెంట్ షోల ద్వారా  చిన్న వయస్సు నుంచి పిల్లలో దాగిఉన్న సృజనాత్మకను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన, అలాగే ఉత్తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి, ఉపాద్యాయులు, తల్లితండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.