ఫిబ్రవరిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు

ఫిబ్రవరిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు

ఫిబ్రవరి:

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అసాధరణంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఫిబ్రవరిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. వారం, పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో గతేడాది మార్చి నెల ఆరంభంలో ఎండలు మండిపోతేనే అబ్బో అన్న ప్రజలకు… ఈసారి ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని రూచిచూపిస్తున్నాడు. రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఎండ తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.