కాకినాడలో రాష్ట్ర కొప్పుల వెలమ సంఘం ఈసీ సమావేశం....
కాకినాడ :
రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం. ఆదివారం కాకినాడలో నిర్వహించారు. స్థానిక ఆర్ ఎల్ గ్రాండ్ హోటల్ లో రాష్ట్ర అధ్యక్షుడు చింతల వాసు అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ కన్వీనర్ రావు సంబంగి కమిటీ ఎజెండాను సమర్పించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రధానంగా తొమ్మిది తీర్మానాలను అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.ప్రధానమైనవి 1.ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మద్దతు ప్రకటించారు. వామపక్షాల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోరెడ్ల రమాప్రభకు రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది రాష్ట్ర ప్రతినిధులు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీకి మద్దతుగా పర్యటించడానికి ఆమోదం తెలిపారు.
2. గొర్రిపాటి బుచ్చి అప్పారావు కాంస్య విగ్రహాన్ని ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ప్రతిపాదించారు.
3. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కి అలాగే ప్రముఖ సినీ నటుడు నిర్మాత దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి సన్మానాలు చేయాలని నిర్ణయించారు.
4. తెలంగాణలో ఉన్న కొప్పుల వెలమ లకు బీసీ స్టేటస్ నిలబెట్టుకోవడం కోసం బి అర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు కాకినాడ జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

