రిజిస్ట్రేషన్ కాకుండానే భూమి అమ్మకాల? వార్డ్ మెంబర్ గా ఉంటే ఏదైనా చేయొచ్చా...!
అల్లూరి సీతారామరాజు జిల్లా:
ప్రజాప్రతినిధులే రిజిస్ట్రేషన్ కాని భూమి అమ్మడం ఎంతవరకు సమంజసం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ( సి సి ఎల్ ఏ & రాజ్ భవన్)ఆదేశాలను బేకతర్ చేస్తున్న రెవెన్యూ శాఖ
సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నిలుపుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్ లో, వైయస్సార్ ప్రభుత్వం వచ్చి జిల్లాలు విభజన చేయడంతో గిరిజన ప్రాంతంలో ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి, పేద మధ్య తన మన అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్ కాని భూములు కబ్జాలకు గురిచేసి రిజిస్ట్రేషన్ అయినట్లు చూపించి పలువురు అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా వివరాల్లోకి వెళితే.....అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో నకిలీ పట్టాదారులు అల్లంగి కొండలరావు ఆరో వార్డ్ నెంబర్ భూమి అమ్మకాన్ని తెర తీశారు. గత పూర్వం పట్టా నెంబరు 40 (పట్టాదారుడు ఓండ్రు కొండలరావు తండ్రి జమ్మన్న ) ఇతని దగ్గర అల్లంగి కొండలరావు తండ్రి సముద్రం ఇతను భూమి కొనుక్కున్నట్లు చెబుతున్నారు. కానీ అతనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా పాడేరు రెవెన్యూ శాఖ రికార్డులలో 1-బి అడంగలలో అల్లంగి కొండలరావు పేరు ను నమోదు చేయడం .. అదేవిధంగా కొత్త పట్టా పాసుబుక్ జారీ చేయడం జరిగింది . ఇదే విషయంపై వంట్లమామిడి పంచాయితీ సెక్రెటరీ విఆర్ఓ వారికి ఫిర్యాదు రూపంగా కూడా ఇవ్వడం జరిగింది ఓ గ్రామస్తుడు నకిలీ పట్టాదారుని పట్టా నెంబర్లలో సర్వేనెంబర్ 41-1 0-62 విస్తీర్ణం ఇంకొకరికి నకిలీ పట్టాదారుడు అమ్మకాలు చేసాడు.అతని దగ్గర కొనుక్కున్న వ్యక్తి గదబరి సోంబాబు ( టీచర్) అదే సర్వే నెంబర్లు ఇంకా చాలా మందికి అమ్మకాలు జరిగాయి. ఈ నకిలీ పట్టాలో ఇలా అమ్మకాలు జరుగుతున్నాయని పంచాయితీ సెక్రెటరీ మరియు విఆర్ఓ వారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఆదేశాలు AP CCLA. S Ref. NO . V. S. Il(2) /2022.16/06/2022.. AP Special Chief Secretariry Letter no RB -16/822/2022-A3/T3. Dt 27/12/2022 అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు RC NO.319/2022 ఉన్నప్పటికీ సంబంధిత రెవెన్యూ శాఖ ఎంక్వైరీ జరుపుకుండా.ఈ నకిలీ పట్టాదారుల సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాలు జరుగుతూనే ఉన్నవి ఇటువంటి సర్వే రిపోర్ట్ లేకుండా అక్రమ కట్టడాలకు 550 ట్రాక్టర్ల మట్టి లోడ్లు వేసి నకిలీ పట్టాదారులలో అమ్మకాలు హల్ చల్ జరుగుతున్నాయి.వెంటనే రెవిన్యూ శాఖ అక్రమ కట్టడాలను ఆపాలి నకిలీ పట్టాలు ఉండి చలామనవుతున్న వారిని చట్టపరమైన చర్యలు తీసుకున్న విధంగా చూడాలని.... ఫిర్యాదు ఇచ్చిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

