ఓబీసీ మోర్చా ప్రశిక్షణ శిబిరాలు
వి న్యూస్ విశాఖ 27
బిజెపి ఓబీసీ మోర్చా విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పోతిన పైడిరాజు ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి మరియు అరకు జిల్లా ఓబీసీ మోర్చా ప్రశిక్షణ శిబిరానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ పల్లి శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర కోశాధికారి కంటుబుక్తా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమణరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలమంచిలి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ యాదవ్, ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు, జోనల్ ఇంచార్జ్ గురుపూరు వెంకటనాయుడు, రాష్ట్ర సోషల్ మీడియా కోవెల కొర్రు రాకేష్, జిల్లా విస్తారక్ అనంత్ మహంతి, అరకు జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, ఓబిసి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు గనివాడ పార్వతి, ప్రధాన కార్యదర్శి మరియు ఎస్.కోట ఇంచార్జ్ కిలపర్తి సత్యనారాయణ, కార్యదర్శి మరియు భీమిలి ఇంచార్జ్ పంపాన శ్రీధర్, కార్యదర్శి వివి రమణ, కార్యదర్శి పోతిన ప్రసాదు, కార్యదర్శి పిల్లి దుర్గారావు, వెస్ట్ ఇంచార్జ్ రాపేటి నారాయణరావు, మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితర ఓబిసి నాయకులు పాల్గొన్నారు.

