*అఖిల పక్షల చర్చల సమావేశంలో వెలుగు కి వచ్చిన సొసైటీ భూముల దందా*...!
హుకుంపేట:
*హుకుంపేట మండల కేంద్రంలో కో- ఆపరేటివ్ సొసైటీ భూములు కనుమరుగు?సొసైటీ భూములను ప్రైవేట్ వ్యక్తులు బేరాలు**పట్టించుకోని శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం*
హుకుంపేట మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న కో- ఆపరేటివ్ సొసైటీ భూములు కనుమరుగవుతున్న నిమ్మకు నీరెత్తినట్టులు సంభందిత శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఉన్నారు.
ప్రభుత్వ భూమిని ఒక కాంట్రాక్ట్ కు అద్దెకు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ స్థలంలో కాంట్రాక్టర్ ఇతర వ్యాపారాలు చేస్తుండగా ఆ సంభందించిన సామగ్రిని అఖిల పక్షం నాయకులు తొలగించడం జరిగింది. కళ్ళ ముందే ఇంతటి వైభోగం జరుగుతున్నప్పటికీ కో - ఆపరేటివ్ సొసైటీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, శాఖ అధికారులు ఏమైనా చేతి వాటం చేశారా, లేకపోతె ఇంతవరకు ఎందుకు చట్ట పరమైన చర్యలు తీసుకోలేదు అనే వాటి పైన ప్రజలు, ప్రజాసంఘాలు గుస గుసలు. కొంత మంది మండల వాసులను వివరణ కోరగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి స్థలం ఇచ్చినందున ప్రభుత్వం వారు ఈ భూమిని కేటాయించారని ప్రైవేట్ వ్యక్తులు లకు మద్దతుగా స్థానికులు ఉండటంతో ఇంకా ఈ ప్రభుత్వ భూమి గురించి చర్చలు సాగుతున్నాయి.ఇప్పటివరకు గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకున్న భూమిని ఆ యజమానికి వేరే స్థలం కేటాయించిన దాఖలాలు లేవని,ఒక వేల ఇస్తే మెయిన్ రోడ్డు పక్కనే ఇవ్వడమెంటని ఇందులో ఎవరెవరికి, ఏ ఏ శాఖ వారికి ఎంత మొత్తంలో సొమ్ము చేరి ఉంటదని స్థానికులు, ప్రజాసంఘాలు, సీపీఎం నాయకులు చర్చలు.

