గిరిజనులు హక్కులు చట్టాలు కాపాడుకునేందుకు రోడ్డెక్కిన గిరిజనులు పరుగులు తీస్తున్న అధికార యంత్రాంగం
అల్లూరి జిల్లా:
అధికార యంత్రాంగం వారి విధులు సక్రమంగా నిర్వహిస్తే పోరాటం ఆగుతుంది లేకుండా తారాస్థాయికి చేరడం ఖాయమంటున్న అఖిల పక్షం
*తక్షణమే బినామీలు ఆస్తులను జప్తు చేసి నూతన నిర్మాణాలను కూల్చి వేయాలని డిమాండ్ చేసిన అఖిల పక్షం*
*సానుకూలంగా స్పందించిన రెవెన్యూ యంత్రాంగం*
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో పలు గిరిజన సంఘాలు స్థానికంగా ఉన్న గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కడుతున్నారు అలాగే కాసులు ఎర వేసి గిరిజనులనే బినామీలుగా మార్చి గిరిజనేతరులు హవా కొనసాగిస్తున్నారు.దీని వలన గిరిజనులు హక్కులు చట్టాలు తుంగలోకి తొక్కి గిరిజనులను చులకన భావంతో చూస్తూన్నారని దీనికి అడ్డుకట్ట వేయాలని అనేక సార్లు రెవెన్యూ వారికి తెలియజేసి గిరిజనులు హక్కులు చట్టాలు కాపాడమని వేడుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందించని రెవెన్యూ వారు నేడు పరుగులు పెడుతున్నారు.వివరాలు లోకి వెళ్తే....నగరం నడిబొడ్డున గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కడుతున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసు అధికారులకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్న చర్యలు తీసుకోకపోవడంతే మండలంలో గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం చేయాల్సిన విధులు సక్రమంగా చేయకపోవడం వలన వారి విధులను గిరిజన సంఘాలు వారు నిర్వహించడంతో మన్యం ఒక్క సారిగా ఉలిక్కి పడటమే కాకుండా అనేక ప్రాంతాలా గిరిజనులు మన హక్కులు చట్టాలు కాపాడుకునేందుకు పోరాటాలు ఉద్యమాలు చేపట్టేందుకు మేము సిద్దం అని సంఘిబావం తెలియజేయడంతో ఇప్పటి వరకూ నిద్రపోతున్న అధికార యంత్రాంగం నేడు మేల్కొని ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగమే కదిలి వచ్చి గిరిజన సంఘాలుతో మమేకమై చర్చలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. చర్చలో పలువురు గిరిజన సంఘాలు వారు ఈ సందర్భంగా అధికార యంత్రాంగంకు తెలియ చేస్తున్న ముఖ్య విషయం ఏమిటంటే మన్యంలో 1/70 యాక్ట్ ప్రకారం గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కట్టకూడదనే విషయం వాళ్ళకి తెలుసు ఇటు అధికార యంత్రాంగంకి తెలుసు అయినప్పటికీ మన్యంలో రోజు రోజుకు అక్రమ కట్టడాలు బినామీలు హవా కొనసాగుతుంది దీనికి అడ్డుకట్ట వేయాలని మీకు నేరుగా తెలియజేసాము మీరు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు ఆ సమాచారం కూడా మా దగ్గర ఉంది గిరిజనులందరూ నేరుగా చూస్తున్నారు దీని బట్టి చూస్తే అధికార యంత్రాంగం కూడా వారికి కొమ్ము కాయడం వలనే గిరిజనేతరులు,బినామీలు హవా కొనసాగిస్తున్నారనేది గుర్తించి నేడు మా హక్కులు చట్టాలు రంగంలోకి దిగాము తప్ప అధికారాన్ని చేతులోకి తీసుకునేందుకు కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనేతరులు బినామీలు పేర్లు మీద నిర్మించిన భవనాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి అలాగే నేడు అధికారులు అక్రమ నిర్మాణాలు ఆపి వేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ భేఖాతరంటూ నిర్మాణాలు సాగిస్తున్న భవనాలను తక్షణమే కూల్చి వేయాలి ముఖ్యంగా వలస దారులను ఆపివేయాలని అధికారులకు తెలియజేశారు.తక్షణమే వీటిపై అధికారులు దృష్టి సారించి గిరిజనులు మనోభావాలు దెబ్బ తీస్తున్న గిరిజనేతరులుపై కఠినమైన చర్యలు తీసుకొని వీటికి సంబంధించిన కేసులు పెట్టి తగిన గుణపాఠం చెప్పి తీరాలని లేకుంటే మన్యంలో గల గిరిజన సంఘాలు గిరిజనులు అందరుతో మమేకమై ప్రాణాలు పణంగా పెట్టి అయినా పోరాటాలు ఉద్యమాలు చేపట్టి గిరిజనులు హక్కులు చట్టాలు కాపాడుకుంటామని తెలిపారు.ఏది ఏమైనప్పటికీ అధికార యంత్రాంగంకి గిరిజనులు హక్కులు చట్టాలు తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రశ్నార్థకంగా మారింది అలాగే అధికార యంత్రాంగం వారు చేయాల్సిన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఇంత రచ్చ ఉండదని పలువురు అంటున్నారు.నేడు ఈ చర్చల్లో రెవెన్యూ అధికారులు,పలు గిరిజన సంఘాలు మరియు ముఖ్యంగా మండల పరిధిలో గల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

