డిఏలు మరియు అడిషనల్ సరెండర్ రెగ్యులర్ సరెండర్ మంజూరు అయ్యేలా చూడాలని మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ కి వినతి
సిరిపురం:
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు మరియు యూనిఫామ్ పోస్ట్ లో ఉన్నవారికి రావలసిన డిఏలు మరియు అడిషనల్ సరెండర్ రెగ్యులర్ సరెండర్ మంజూరు అయ్యేలా చూడాలని మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ కి విశాఖ సిరిపురం వద్ద వినతి పత్రాన్ని అందించిన ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సమయం హేమంత కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతా నిద్రపోయినా గాని అనునిత్యం రోడ్ల పైన కొన ఊపిరితో ఉన్న రోగి ప్రాణాలను కాపాడే తాపత్రయం తో కుయ్ కుయ్ అంటూ రోడ్లపై పరుగెత్తే అంబులెన్స్ లాగా అనునిత్యం రాత్రనకా పగలనకా ప్రజల యొక్క ధనమానప్రాణాలను కాపాడుచున్న మన పోలీస్ మరియు యూనిఫామ్ పోస్ట్ లో ఉన్న సోదరులకు ప్రతినెలా రావలసిన టి ఏ బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ 2021 నుండి బుధవారం వరకు ప్రతి నెల రావవలసి టి లు ఇంతవరకు చెల్లించలేదు.అంతేకాకుండా అడిషనల్ సరెండర్లు రెండు పర్యాయములు రెగ్యులర్ సరెండర్ ఒక పర్యాయము మొత్తం మూడు సరెండర్లు పోలీసులకు రావాల్సి ఉన్నది టి ఏ లు రానందువలన అనునిత్యం దూరప్రాంతాలకు విధులకు వెళ్లినప్పుడు సొంతంగా ఖర్చులు పెట్టుకొని వెళ్లి వచ్చేటగాను చాలా రకాల ఆర్థిక ఇబ్బంది పడడం జరుగుతున్నది అని ఆయనకు తెలిపారు.

.jpeg)