వైయస్సార్ గవర్నమెంట్ లో ఎక్కడ అవినీతికి తావు లేదు :అవంతి శ్రీనివాసరావు

 వైయస్సార్ గవర్నమెంట్ లో ఎక్కడ అవినీతికి తావు లేదు :అవంతి శ్రీనివాసరావు 

మధురవాడ : వి న్యూస్ 21                                               

మధురవాడ జీవీఎంసీ జోన్-2 పరిధి 5వ వార్డ్ లో దశాబ్దాలు గడుస్తున్నా,ఈప్రాంత వాసులకు కనీసమౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.ఇవి అన్ని గమనించిన భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో  మౌలికసదుపాయాలు కల్పిస్తున్నారు.విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు,డ్రైనేజీ వ్యవస్థ,రోడ్లు ఏర్పాటు అయ్యాయి.శనివారం రోడ్డుపనులను పరిశీలించారు .


త్వరలోనే ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తానని, శనివారం 1కోటి.15 లక్షల వ్యయంతో 5వ వార్డు పరిధిలో శారదానగర్, వివేకానందనగర్, ముత్యాలమ్మకాలనీ లో నీటి పైపులైన్లకు శంకుస్థాపన అవంతి శ్రీనివాసరావు చేతుల మీదగా జరిగింది.,అనంతరం భాహిరంగ సభలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ :వైస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుచి ఇప్పటివరకు కుల మత భేదాలు లేంకూడా అర్హులైన ప్రతి ఒక్కరికి  సంక్షేమ పథకాలు అందుతున్నాయని అలాగే వైయస్సార్ గవర్నమెంట్ లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తగు చర్యలు చేపడుతున్నారని గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కావాలంటే అధికార చుట్టూ తిరగాల్సి వచ్చేదని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులే ప్రజల చుట్టూ తిరిగి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అవంతి శ్రీనివాసరావు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మరొకసారి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు అవంతి శ్రీనివాసరావు మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ టు జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి,5వ వార్డు కర్పరేటర్ మొల్లి. హేమలత, మాజీ కర్పరేటర్ పోతిన హనుమంత్ రావు,పోతిన.శ్రీనివాసరావు, మొల్లి. లక్ష్మణ్ రావు, జె. ఎస్ రెడ్డి, పోతిన. సురేష్, అప్పన్న, నూకవరపు బాజ్జి, మహిళా నాయకురాలు చేకూరి. రజిని, నాగోతి. జోతిష్,కురిటి లోహిత్, తదితరులు పాల్గొన్నారు.