పద్మశాలి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం కల్పించాలి

 విశాఖలో పద్మశాలి సంఘానికి స్థలం కేటాయించాలి...

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల్లో సముచిత స్థానం కల్పించాలి....

 జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి హాజరైన ప్రముఖులకు వినతి....

విశాఖ వి న్యూస్ జనవరి 22

విశాఖ జిల్లాలో పద్మశాలి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం కల్పించాలని, పద్మశాలి సంఘానికి సామాజిక భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ  విశాఖ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన రాజకీయ ప్రముఖులకు సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఆదివారం శంకరమఠం రోడ్ లో ఉన్న పద్మశాలి భవనంలో విశాఖ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 

వందలాదిమంది కుల బంధువులు హాజరైన ఈ వేడుకల్లో ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి , కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఆప్కోస్ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, రాష్ట్ర చేనేత విభాగ అధ్యక్షులు గంజి చిరంజీవి,  అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాథం, వానపల్లి వెంకట్రావు, ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు కొప్పల ప్రభావతి, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అందే జగదీష్, మహిళా అధ్యక్షురాలు కాపు కళ్యాణి, ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా నూతన కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవం చేయించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, వైసీపీ నాయకులు గోలగాని శ్రీనివాస్,  రాజ్యసభ సభ్యులు జీవియల్ నరసింహరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్,  నెడ్ క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి,  బిమిలీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కోరాడ రాజబాబు,  వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, 14 వార్డు  కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజుతోపాటు వావిలాల సరళ దేవి ఇతర ముఖ్య నాయకులు పాల్గొని పద్మశాలి కులస్తులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో పద్మశాలి కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్రంలో కనీసం ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయించేలా డిమాండ్ చేయాలని, ఆ దిశగా పద్మశాలి కులస్తులంతా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. చేనేత వృత్తి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలి కులస్తులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

నూతన కార్యవర్గం...గౌరవ అధ్యక్షులుగా కొప్పల రమేష్, అధ్యక్షులుగా వానపల్లి ఈశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరిశెట్టి సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా పెంటపల్లి సత్యనారాయణ, పప్పు శ్రీనివాసరావు, నీలి రవి, కోశాధికారిగా నామాల అనేష్ కుమార్, మహిళా విభాగ అధ్యక్షురాలుగా గాయత్రి ఫణి కుమారి, యువత అధ్యక్షులు గా కొండపల్లి సతీష్ లు తోపాటు గౌరవ సలహాదారులుగా కులపాక సన్యాసిరావు, కరణం వెంకటేశ్వరరావు, చిక్కా సత్యనారాయణ, రాపర్తి సుబ్బారావు, కల్లూరి రామూర్తి వ్యవహరించనున్నారు.