కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా 5వ వార్డు కార్పొరేటర్
మధురవాడ వి న్యూస్ 21
జీవీఎంసీ జోన్-2 పరిధి 5వ వార్డ్ శివశక్తినగర్ రోడ్ లోని గాంధీనగర్ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా,ఈప్రాంత వాసులకు కనీసమౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.ఇవి అన్ని గమనించిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత ప్రత్యేక శ్రద్ధతో గాంధీనగర్ కు మౌలికసదుపాయాలు కల్పిస్తున్నారు.
విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు,డ్రైనేజీ వ్యవస్థ,రోడ్లు ఏర్పాటు అయ్యాయి.శనివారం రోడ్డుపనులను దగ్గర ఉండి పరిశీలించారు.త్వరలోనే ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తానని, ఈరోజు 1కోటి.15 లక్షల వ్యయంతో 5వ వార్డు పరిధిలో శారదానగర్, వివేకానందనగర్, ముత్యాలమ్మకాలనీ లో నీటి పైపులైన్లకు శంకుస్థాపన జరిగిందని,త్వరలోనే సాయిరాంకాలనీ,డ్రైవర్స్ కాలనీ,వికలాంగులకాలనీ కొండవాలు ప్రాంతాలకు నీటి సౌకర్యం తో పాటు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తామని స్థానిక ప్రజలకు కార్పొరేటర్ మొల్లిహేమలతకు హామీ ఇచ్చారు.ఈసందర్భంగా గాంధీనగర్ ప్రజలుకార్పొరేటర్ హేమలతకు కృతజ్ఞతలు తెలిపారు.

