పారదర్శకంగా జివిఎంసి పొరుగు సేవల ఉద్యోగ నియామకం.

పారదర్శకంగా జివిఎంసి పొరుగు సేవల ఉద్యోగ నియామకం.

--- జివిఎంసి కమిషనర్‌ పి రాజాబాబు

విశాఖపట్నం:

విశాఖపట్నం, డిసెంబర్ - 9:- మహా విశాఖ నగర పాలక సంస్థలో  ప్రజారోగ్య విభాగములో పొరుగు సేవ పద్దతి (ఆప్కాస్ద్వారా పనిచేయుచున్న పారిశుధ్య సిబ్బందిలో వివిధ కారణముల వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి గాను జిల్లా సమాచార అధికారి ద్వారా ఉద్యోగ భర్తీ కొరకు తేది.02-12-2022న నోటిఫికేషన్ జారీచేయడమైనదని జివిఎంసి కమిషనర్ పి రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారుదరఖాస్తు ప్రతిని విశాఖ జిల్లా అధికారక, మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ అధికారక వెబ్ సైట్ లో దరఖాస్తును ఉంచడమైనదని తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయముతో పాటు అన్ని జోనల్ కార్యాలయములలో నోటీసు బోర్డు నందు ఈ దరఖాస్తుతో పాటు అభ్యర్దులకు కావలసిన అర్హతల వివరముల ఉంచడమైనదని తెలిపారు. అభ్యర్డుల యొక్క దరఖాస్తులనుఅర్హతలు జత పరచివలసిన పత్రాలతో పాటు మహా విశాఖ నగర పాలక సంస్థలో ప్రజా రోగ్య విభాగములో దరఖాస్తులను తేది.09-12-2022న సాయంత్రం గం,, వరకు స్వీకరించబడునని తెలిపారు. దరఖాస్తుల స్వీకరించు సదరు గడువును తేది.20-12-2022న సాయంత్రం గం,, వరకు పొడిగించబడినదని కమిషనర్ తెలిపారు.

పొరుగు సేవల ద్వారా పారిశుధ్య సిబ్బంది ఎంపిక, నియామకం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధి విధానములు అనుసరించి జి.వి.యం.సి కమిషనరు ఏర్పాటు చేసిన ప్రాధమిక  కమిటీ దరఖాస్తును పరిశీలించిన పిదప జిల్లా కలెక్టర్ నేతృత్వములోని కమిటీ ద్వారా ఎంపిక పారదర్శకముగా జరుగునని, ఇందు విషయమై  దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కమిషనర్ తెలిపారు.