పద్దెనిమిది సంవత్సరములు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్ నమోదు చేసుకోవాలి:
విశాఖపట్నం రూరల్ తహసీల్దార్:పాల్ కిరణ్
విశాఖపట్నం రూరల్:
పద్దెనిమిది సంవత్సరములు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్ నమోదు చేసుకోవాలని విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ విశాఖపట్నం రూరల్లో ఉన్న పౌరులకు సూచించారు. భీమిలి నియోజకవర్గం ఆర్. డి. ఓ, ఈస్ట్, ఈ ఆర్ ఓ ఆధ్వర్యంలో విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ పరిధిలో ఉన్న కళాశాలకు వెళ్లి పద్దెనిమిది ఏళ్ళు నిండిన విద్యార్థులకు ఓటు గుర్తింపు పై అవగాహన కల్పిస్తూ ఓటు నమోదు కార్యక్రమం చేస్తున్నామని బి ఎల్ ఓ ల ద్వారా ప్రతీ ఇంటిలో ఉన్న ఓటు నమోదు కానీ యువత వద్ద నుండి ఓటు గుర్తింపు నమోదు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జనవరి 1వ తేదీకి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉన్నవారికి మాత్రమే ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉండేదని ఇప్పుడు నాలుగు విడతలుగా జనవరి1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1కి 18ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ పరిధిలో ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ సూచించారు.

