మధురవాడలో పెరుగుతున్న చరవాణి చోరీలు..
మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబరు 09
మనిషి మనుగడలో ఒక భాగంగా చరవాణి స్థిరపడిపోయింది .ప్రొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు చరవాణితోనే మనిషి జీవితం ప్రస్తుత కాలంలో ఆధారపడి ఉంటుంది. ప్రతినిత్యం ఈ చరవాణి ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాము అలాంటి చరవాణిని కొందరు దొంగలించడం వల్ల అందులో ఉన్న కొన్ని అవసరమైన విషయాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని బలరాం. నాయుడు అనే వ్యక్తి తెలిపారు.
గురువారం విజయనగరం వెళ్లాలని మారివలస బస్టాప్ దగ్గర కుటుంబంతో బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడు బస్సు రాగానే బస్సు ఎక్కేటప్పుడు చరవాణిని దొంగలించడం జరిగిందని చరవాణిలో తనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఫోన్ నెంబర్స్ అవి ఉన్నాయని తెలియజేయడం జరిగింది . అలాగే ఇలా చరవాణి పోగొట్టుకున్న వాళ్ళు నాలా చాలామంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.మరి కొంతమంది ఫిర్యాదులు కూడా చేయడం లేదు .అందుకని పోలీసు వారు చరవాణి దొంగలపైన దృష్టి పెట్టి చరవాణి చోరీలు జరగకుండా చూస్తారని కోరుకుంటున్నట్టు బలరాం.నాయుడు తెలిపారు.
చరవాణి దొంగిలించబడింది అని బాధితుడు బలరాం. నాయుడు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియా ద్వారా తెలియజేశారు..

