రోడ్డు ప్రమాదం లో ఇద్దరు విద్యార్థుల కు తీవ్ర గాయాలు
భీమునిపట్నం, వి న్యూస్ డిసెంబర్, 9, :
జీవీఎంసీ పరిది తాళ్లవలస ఒడిశా డాబా వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భీమిలి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్తున్న లారీని విశాఖపట్నం నుండి అవంతి కాలేజీ కి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు ఓ పెట్రోల్ బంకు ఆగి ఉన్న లారీ ను ఢీకొనడంతో ఇద్దరు కు తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నం, కూర్మన్నపాలెం కు చెందిన జె. జస్వంత్,అవంతి కాలేజీ లో సైబర్ కోర్సు,ఓ. మౌళి సి. ఎస్. సి. తృతీయ సంవత్సరం చదువుచున్నారు. కాలేజీకి ఆలస్యం అవుతుందని పల్సర్ బండి పై అధిక వేగంతో రావడం తో ఆగి ఉన్న లారీని ఢీ కొన్నారు. ఇద్దరు హెల్మెట్ ధరించడంతో తలకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు స్థానిక అనిల్ నీరుకొండ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారు. వారిరువురికి ఎటువంటి ప్రాణనష్టం లేదని వైద్యులు తెలిపారు.

