ఎల్ డి ఎమ్ శర్మ ఆధ్వర్యం లో ఆర్థిక అక్షరాస్యత

ఎల్ డి ఎమ్  శర్మ  ఆధ్వర్యం లో ఆర్థిక అక్షరాస్యత 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఎల్ డి ఓ  పూర్ణిమ మరియు  ఎల్ డి ఓ  హనుమకుమారి, విశాఖపట్నం జిల్లా  ఎల్ డి ఎమ్  శర్మ  ఆధ్వర్యం లో నేడు ఉదయం గం.11.00 లకు  ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం రమ్య ప్యారడైజ్, మిధిలపురి నందు ఎంతో చక్కగా జరిగింది.ఇందు లో సీనియర్ సిటిజెన్లు, రైతులు,విద్యార్థులు,మహిళలు,వ్యాపారస్తులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన అనంతరం అందరికీ రిజర్వ్ బ్యాంక్ తరుపున బహుమతులు అందజేశారు. 

ఏపీజీవీబి మధురవాడ బిఎమ్ శ్రీనివాస యాదవ్   పాల్గొన్నారు. కార్యక్రమం శ్రీ మధుసూధన్ రావు, కౌన్సిలర్, ఫైనాన్సియల్ లిటర్సీ, విశాఖ జిల్లా వారి పర్యవేక్షణ లో జరిగింది. సైబర్ నేరాల గురించి, వివిధ ప్రభుత్వ రంగ పథకాల గురించి వివరించారు.