పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు బలవన్మరణం.

పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు బలవన్మరణం. 

అల్లూరి సీతారామరాజు జిల్లా వి న్యూస్ డిసెంబర్ 8 :-

ఆఫీసు పక్కనున్న షెడ్ లో ఉరి వేసుకున్న వైనం

ఇటీవలే పెదబయలులో బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు బలవన్మరణంకు పాల్పడ్డారు. లక్ష్మివారం తెల్లవారుజామున ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ కు శ్రీనివాసరావు కనిపించలేదు. దీంతో, ఆ ప్రాంతమంతా వెతకగా... పక్కనే ఉన్న ఒక షెడ్ లో ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో అక్కడ విషాదం అలముకుంది.  

మరోవైపు ఇటీవల జరిగిన సమావేశానికి శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురై, బలవన్మరణంకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.