వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అవస్థలు పడుతున్న పేదలు

వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అవస్థలు పడుతున్న పేదలు

పాడేరు:

రాష్ట్రంలో కానరాని అభివృద్ధి

రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం

వైసిపి ప్రభుత్వ పాలనలో పేదలు అవస్థలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం అన్నారు. ఆదివారం పాడేరు పట్టణం గుడివాడ గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అర్హుల సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తోందని,యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని, రాష్ట్రంలో అభివృద్ధి కన రావడంలేదని సంక్షేమం మాటున ప్రజలను వైసిపి ప్రభుత్వం మోసం ఇస్తుందన్నారు.తక్షణమే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలను కోరారు.