గిరిజన సంఘం- గిరిజన సమాఖ్య

గిరిజన సంఘం- గిరిజన సమాఖ్య.

పెదబయులు:

ఐటీడీ ఏ పీఓను రక్షించడం కోసం గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదు.

పెదబయులు మండలం తహసిల్దార్ ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ నిర్వహించకుండానే అమాయకమైన గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరైనది కాదని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడ రాధాకృష్ణ ప్రభుత్వ వైఖరి నీ తీవ్రంగా ఖండించారు.

పెదబయలు మండలం తహసీల్దార్ ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని తాసిల్దార్ భార్య పేర్కొన్నారు. హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తామని మీడియా ముందు ప్రకటించారు. తాహసీల్దార్ మృతిపై గిరిజన ప్రజా సంఘాలు సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఐటిడిఏ పిఓ ను రక్షించడం కోసం పెదబయలు మండలం లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మరియు సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడం అన్యాయం.

జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇటివల కాలం లో నిర్వహించిన సమావేశంలో పెదబయలు తాహసీల్దార్ పై తీవ్ర పదజాలంతో పాడేరు ఐ.టి.డి.ఏ పిఓ గోపాల కృష్ణ మందలించడం జరిగింది. 

ఐ టి డి ఏ పిఓ ప్రయోగించిన పదాలతో మనస్థాపానికి గురి అయిన పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్య చేసుకుంటానని ఐటిడిఏ పిఓ ఈ రకంగా తిట్టడం నా సర్వీస్ లో ఎదురుకాలేదాని , తీవ్రమైన మనోవేదనకు, సంఘర్షణకు గురవుతు ఆత్మహత్య చేసుకునే ముందు తన సిబ్బందితో పేర్కొన్నట్లు అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇటువంటి నేపథ్యంలో గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది.

సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వలన గిరిజన ఉద్యోగస్తులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటువంటి చర్య గిరిజన ప్రాంతంలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల పట్ల గౌరవప్రదమైనది కాదని, కుటుంబాలను వదిలేసి గిరిజన ప్రాంతంలో విధులు నిర్వహించడానికి వస్తున్న అధికారులకు మనోధైర్యం ఆత్మ అభిమానాన్ని గౌరవించేలా ఉన్నతాధికారులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. తాహసీల్దార్ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.