నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు తోనే నా ప్రయాణం..
విశాఖ వి న్యూస్ 2022 డిసెంబర్ 05
గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చేరిక ఖాయమని.. వైఎస్సార్‌సీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తాను పార్టీ మారడం లేదని.. టీడీపీలో కొనసాగుతానని చెప్పినట్లుగా ఉంది. తెలుగు తమ్ముళ్ల ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉంటారని భావిస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది.
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు అడుగులు ఎటువైపు. కొద్దిరోజులుగా ఆయన వైఎస్సార్‌సీపీ వై ఎస్ ఆర్ సి పి లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పుట్టిన రోజు తర్వాత నిర్ణయం తీసుకుంటారని.. వైఎస్సార్‌సీపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. టీడీపీని వీడటం ఖాయమని.. జగన్ సమక్షంలో త్వరలోనే చేరిక ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. మాజీ మంత్రి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గంటా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారని.. టీడీపీలో కొనసాగుతానని చెబుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. 'నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు తోనే నా ప్రయాణం.. తెలుగుదేశం పార్టీలోనే ఉంటా.. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
