గంటా వైస్సార్సీపీ లో చేరుతున్నారు అనే ప్రచారం ఆయన రాజకీయ ఎత్తుగడ?

గంటా వైస్సార్సీపీ లో చేరుతున్నారు అనే ప్రచారం ఆయన రాజకీయ ఎత్తుగడ?

భీమిలి:

భీమిలి నియోజకవర్గం సీటు పై ఆయన ఆశిస్తున్నారు అందులో భాగమే ఈ ప్రచారం అంటున్న విశ్లేషకులు.

గంటా శ్రీనివాసరావు. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్నారు. వ్యాపారవేత్తగా మరోవైపు రాణిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి విశాఖపట్నం వలస వచ్చిన తర్వాత విశాఖలో స్థిరపడ్డారు.

రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఎన్నో నియోజకవర్గాల్లో పోటీచేశారు. ఒక నియోజకవర్గంలో పోటీచేయగానే తర్వాత పోటీచేయాల్సిన నియోజకవర్గం కోసం పక్కచూపులు చూస్తారంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు.

భిన్నమైన రాజకీయవేత్తగా ఉంటారనే..విశ్లేషకుల అభిప్రాయం

ఎందుకంటే ఆయన ఎక్కడ గెలిచినా ఒకసారే.. ఒకచోటే. తర్వాత ఆ నియోజకవర్గాన్ని వదిలేస్తారు. వదిలేసే ఉద్దేశంతో ఉంటారు కాబట్టే నియోజకవర్గానికి అది చేయాలి.. ఇది చేయాలి.. అంటూ ఆరాటపడరనే విమర్శలున్నాయి. ఒక నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత నుంచే తర్వాత ఎన్నికల్లో పోటీచేయడానికి మరో నియోజకవర్గం గురించి ఆలోచిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల చేత మన్ననలందుకొని రెండోసారి గెలవాలనే ఉద్దేశంలో ఉంటారు. కానీ గంటా రాజకీయం అందుకు భిన్నంగా సాగుతుంటుంది.

అవసరాన్ని బట్టి స్థానిక నాయకులతో కలిసిపోతారు..

తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి స్థానికంగా బలమైన నాయకులుగా చెలామణి అయ్యేవారిని మచ్చిక చేసుకుంటారు. పోటీచేయడానికి ముందే నియోజకవర్గంలో పునాది వేసుకుంటారు. తర్వాత ఆయన విజయం సులభమవుతుంది. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ గాలిని తట్టుకొని ఆయన గెలవగలిగారంటే రాజకీయ చాణక్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే వచ్చే ఎన్నికల కోసం భీమిలీ లో పాగా వేస్తారా..?

1999 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలీ నుంచే ఎన్నికయ్యారు. 2019లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

అయితే ఆయన ఏమైనా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నిస్తే మౌనమే సమాధానమవుతుందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు.అభిమానులు ఆయన ప్రాతినిద్యం వహించిన నియోజకవర్గం లో ప్రజలు మాత్రం గంటా శ్రీనివాస్ పై మళ్ళీ మా నియోజకవర్గం లో పోటీ చేస్తే బాగున్ను అని కోరుకుంటున్నారని కొందరు తెలుపుతున్నారు.2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయాలనుకుంటున్నారో ఇంకా స్పష్టత రాలేదు. భీమిలీ నుంచి వైసీపీ తరఫున పోటీచేయాలనే ఉద్దేశంతో గంటా ఉన్నారు. ప్రస్తుతం అక్కడినుంచి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వైసీపీలో చేరితే భీమిలీ టికెట్ ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు.

గంటా శ్రీనివాసరావు అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు మాత్రం ఆయన భీమిలి అసెంబ్లీ సీటు ఆశిస్తున్న మాట మాత్రం వాస్తవమే టీడీపీలో లేదా జనసేన నుండి పోటీ చేస్తే ఆయనకి భీమిలిలో పోటీ లేకుండా భారీ మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. గత రెండేళ్ల నుండి ఆయన ఉత్తర నియోజకవర్గం లో గెలిచిన భీమిలి లో కార్యక్రమాలలో పాల్గొని భీమిలి నాయకులతోనే ఎక్కువగా కలుస్తూ ఉన్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఆయన రాజకీయం తెలిసినవారు ఇది ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని తెలిసి తెలిసి వైస్సార్సీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత గురించి తెలిసి కూడా వైస్సార్సీపీ చేరరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.