సామాజిక సేవతో యువత ముందుకు రావాలి..!
విజయనగరం:
రక్తదాన శిబిరంలో ఉత్తరాంధ్ర టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి
విజయనగరం ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వ్యంలో ఎగువపేట శ్రీ నూకాలమ్మ ఆలయం వేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని గాడు చిన్ని కుమారి లక్ష్మి, సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎవరైతే స్వచ్చందoగా ముందుకు వచ్చి రక్తదానం చేశారో వారిని మనస్పూర్తిగా అభినందించి, ప్రశంసా పత్రాన్ని ఇరువురు అందజేశారు. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతీ యువత ముందుకు వచ్చి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆన్నారు. సమాజ శ్రేయస్సుకు యువతే మార్గదర్శకమని, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ నాయొక్క అభినందనలు అని అమే ఆన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మంచి కార్యక్రమానికి నాంది పలికిన ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ టీమ్ అందరికీ ధన్యవాదాలు అని గాడు చిన్ని కుమారి లక్ష్మి తెలియజేశారు.

