రత్నంపేట గ్రామ త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా:
కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామం మాది ఇక్కడ మా తాత తండ్రుల నుంచి రత్నంపేట గ్రామంలోనే నివసిస్తున్నాము కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదు కనీసం మా ఊర్లో కుళాయిలు కూడా లేవు నీటి వసతులేని అటువంటి రత్నంపేట గ్రామం ఇరువైపులు ఉన్న గ్రామాలన్నీ కూడా నాన్ ట్రైబల్ఏరియాకి సంబంధించిన ఏరియా మధ్యలో మా రత్నంపేట గ్రామం ఒకటే అల్లూరు జిల్లాలో ఉండిపోయింది కనుక ప్రభుత్వం వారు మా రత్నంపేట గ్రామాన్ని నాన్ ట్రబుల్ ఏరియాలో పెట్టవలసిందిగా కోరుచున్నాము.మేము నిరుపేదలగానే ఉండిపోయాము మేము వలసలు వెళ్లికూలి పని చేసుకుంటున్నాము మారతంపేట గ్రామంలో 150 ఇళ్లు ఉన్నవి వీళ్ళందరికీ ఒకే ఒక చేతి బోర్ ఉన్నది రత్నంపేట నీటి సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుచున్నారు.
