పశ్చిమ శాసనసభ్యుడు పి. గణబాబు తనయుడు యువ కిశోరం మౌర్య సింహ బాబు జన్మదిన వేడుకలు.
విశాఖ పశ్చిమ:
విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు పశ్చిమ శాసనసభ్యుడు పి. గణబాబు తనయుడు యువ కిశోరం మౌర్య సింహ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.అధిక సంఖ్యలో అభిమానులు , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మౌర్య సింహ బాబు చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు.89 వార్డ్ టీడీపీ నాయకుడు బొడ్డేటి విజయ్ ఆధ్వర్యంలో యువతకి హెల్మెట్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు ,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
