శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వ్యక్తికి నగర బహిష్కరణ

 శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వ్యక్తికి నగర బహిష్కరణ...

మధురవాడ: వి న్యూస్   నవంబర్ 2: 

శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వ్యక్తిని నగర బహిష్కరణ విశాఖ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో చేపట్టారు. పి.ఎం.పాలెం ఆర్.హెచ్ కాలనీకి చెందిన పెంటకోట కిరణ్, అనే యువకుడు తరచూ చట్టవ్యతిరేక కార్యలకాపాలకు పాల్గొంటూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ ప్రజలను భయబ్రాంతులకు కల్గిస్తున్నాడని పి.ఎం.పాలెం సి.ఐ యెన్ని రామక్రిష్ణ అన్నారు.

అతని పై గతంలో రౌడీ షీట్ కూడా నమోదు అయ్యిందని తెలిపారు. అతడి కదలికలను, ప్రవర్తనను పరిశీలించామని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం, పెంటకోట కిరణ్ ను అక్టోబర్ 31వ తేదీ నుండి 6 నెలలు పాటు నగర బహిష్కరణ విధిస్తూ విశాఖ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులను జారీ చేయడమైనదని అన్నారు.