బూరుగ గ్రామంగిరిజనులకు తప్పని డోలుమూతలు

బూరుగ గ్రామంగిరిజనులకు తప్పని డోలుమూతలు

అనంతగిరి:

ఎనిమిది కిలోమీటర్లు ఎత్తైన కొండల మధ్య డోలుమూత ద్వారా సారడవలస గ్రామం వరకు డోలి కట్టుకొని తీసుకెళ్లిన ఆదివాసులు.

అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ బూరుగ. చిన్నకోనిల గ్రామంలో 300 మంది నివాసం జనాభా జీవనం సాగిస్తున్నారు..

బూరుగ మల్లమ్మ( 50) గ్రామంలో నిన్నమంగళవారం సాయంత్రం  కుక్క కరవడంతో. జ్వరం వచ్చింది జ్వరంతో బాధపడుతున్న బూరుగు మల్లమ్మను సంవత్సరాలు( 50)తన కుమారులు విజయనగరం జిల్లా మెంటాడ మండలం సారడవలస  గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం డోలు కట్టి భుజం మీద మోసుకెళ్లి. అక్కడ ఆటో కి మెంటాడ హాస్పిటల్ లో జాయిన్ చేయగా గజపతినగరం ఏరియా ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్ ఫోన్ చేయగా అంబులెన్స్ అందుబాటులో లేదని. సొంత డబ్బులతో ఆటో పెట్టుకొని విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా హాస్పిటల్ కి జాయిన్ చేశారు చిక్స్ చేయించుకొని. బుధవారం సాయంత్రం సారడవలసిన నుండి బూరుగువరకు డోలు కట్టి తన సొంత గ్రామానికి తీసుకెళ్లారు.

 బురుగు గ్రామానికి భీమవరం PHC వెళ్ళాలంటే 20 కిలోమీటర్ దూరం ప్రయాణం అంబులెన్స్లు అందుబాటులో ఉండవు  వెహికల్స్ అందుబాటులో ఉండవు. దీనికి నిత్యం విజనగరం జిల్లా గజపతినగరం ఏరియా హాస్పిటల్ కి తరచూ చూపించుకుంటుంటారు. ఈ విధంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేటికీ డోలుమూతలు తప్పడం లేదు. అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు కేటాయిస్తున్న కొండ శిఖర గ్రామాలకు కాగితాలకే పరిమితం అవుతున్నాయి గత సంవత్సరం ఐ టి డి ఎ po గారు రోనంకి గోపాలకృష్ణ. మండల స్థాయి అధికారులు స్వయంగా పరిశీలన చేసిన ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. అనంతగిరి మండలం ఎన్ ఆర్ పురం నుండి బూరుగు గ్రామానికి ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు పనులు జరుగుతున్న ఈ రోడ్డు మాత్రం గిరిజనులకు అత్యవసరం అత్యవసర పరిస్థితుల్లో విజయనగరం హాస్పిటల్ దిక్కు. ప్రజల అవసరాల కోసం రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటది. భూస్వాములు గిరిజన పేరు మీద భూములు మార్చుకొని. గ్రీజినేయులు అనుకూలంగా రోడ్లు వేయడం వల్ల గిరిజనులకు మాత్రం ఉపయోగపడటం లేదు. ఇప్పటికైనా బూరు గ్రామం నుండి సారడవలస గ్రామం వరకు ఉపాధి పథకం రోడ్డు మంజూరు చేస్తే. వైద్య సౌకర్యం కోసం అందుబాటులో ఉంటాయి. నేటికీ  రోడ్డు మంజూరు చేయాలని చెప్పి రొంపెల్లి పదో వార్డు సభ్యుడు సోముల  అప్పలరాజు. బూరు గా పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.