అనాధ పిల్లలకు బియ్యం పంపిణీ : నవీన్ జ్ఞానేశ్వర్ దాతృత్వం
ఆనందపురం : వి న్యూస్
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అనాధ పిల్లలకు ఆహారం పంపిణీ చేశారు. మధురవాడ వద్ద అమ్మఒడి పేరు తో నిర్వహిస్తున్న అనాధ పిల్లల ఆశ్రమానికి 100 కిలోల బియ్యం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానంమహాపవిత్రమైంది అన్నారు.
అందులోనూ అనాధ పిల్లలకు అందజేయడం ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. ఆకలి తీర్చి మానవ మనుగడలో కీలక పాత్ర వహించిన అన్నం పర బ్రహ్మ స్వరూపమని అభివర్ణించారు. చాలామంది అన్నం ను వృధాగా పారబోయడం చేస్తుంటారని అది సరైనది కాదన్నారు. ఎన్ని ప్రయాసలు పడితే గాని మనకు ఆహారం లభ్యం కావడం కష్టం అన్నారు. అన్నం అమూల్యమైనది గా అందరూ భావించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వరి తో పాటు ఆశ్రమం నిర్వాహకురాలు వి.విశాలాక్షి ,శ్రీనాథ్ ప్రేమ్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.

