అనాధగా ఉన్న శవానికి అంత్యక్రియలు నిర్వహించిన 76వసచివాలయం మహిళా పోలీసులు.

అనాధగా ఉన్న శవానికి అంత్యక్రియలు నిర్వహించిన 76వసచివాలయం మహిళా పోలీసులు

మధురవాడ:

మధురవాడ విశాఖ జిల్లా

భీమిలి నియోజకవర్గం మధురవాడ ఐదో వార్డ్ మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ 68 బ్లాక్ 76వ సచివాలయం పరిధిలో 78 సంవత్సరాలు కర్రీ వెంకటరమణ మూర్తి అనారోగ్యంతో రెండు రోజులు క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న అతనికి ఎవరూ లేకపోవడం వలన నా అన్నవారు లేకపోయినా కన్న బిడ్డలు వదిలేసినా, అనారోగ్యం కారణమైనా.. ఎవరైనా ఫుట్ పాత్ పై తనువు చాలిస్తే.. అలాంటి మృతదేహాలను ఎవరూ పట్టించుకోరు. అంతెందుకు అనారోగ్యంతో దగ్గర బంధువులు మరణిస్తే కనీసం చూసేందుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్న రోజులు ఇవి వాలంటరీ ప్రశాంతి 76వ సచివాలయం మహిళా పోలీసులకు తెలియజేయడంతో వారు స్పందించి సచివాలయం మహిళా పోలీసులు ప్రియాంక లీల మృతదేహాన్ని దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు వారికి సహాయ సహకారాన్ని అందించిన మహిళ మిత్ర సుజాత రెడ్డి, ఆర్పీ కామాక్షి, వైసిపి నాయకులు దువ్వు శీను ,శ్రీ దొర దగ్గరుండి సహాయం అందించారు.అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన మహిళా పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.